18-06-2025 06:13:17 PM
నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ(Elderly Welfare Department) ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా పంపిణీ చేసే ఉపకరణాల కోసం దరఖాస్తుల గడువులు ఈనెల 30 వరకు తొలగించాలని దివ్యాంగ సంఘ నాయకులు సట్టి సాయన్న బుధవారం కలెక్టర్కు వినతిపత్రం అందించారు. జిల్లాలో దివ్యాంగుల అర్హతలు గుర్తించి పారదర్శకంగా ఈ పథకాన్ని లబ్ధిదారులకు అందేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యం ఇస్మాయిల్ పాల్గొన్నారు.