02-10-2025 12:36:49 AM
ఎమ్మెల్యే జారె
ములకలపల్లి, అక్టోబర్ 1, (విజయక్రాంతి)త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేతనం ఎగరవేయాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పిలుపునిచ్చారు.బుధవారం ములకలపల్లి మండల కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొని మాట్లాడారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని గ్రామ స్థాయిలో ప్రజలను సమన్వయం చేస్తూ రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయకేతనం ఎగరవేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు,మాజీ జెడ్పిటిసి సభ్యులు బత్తుల అంజి, పెటేటి నరసింహ రావు, సత్యనారాయణ,సుదీర్, పత్తిలాల్, చెన్నారావు,మహిళా కాంగ్రెస్ నాయకులు పద్మశ్రీ,జయసుధ తదితరులు పాల్గొన్నారు.