గాంధీ భవన్‌లో చేతివాటం!
మంత్రుల ముందే కాంగ్రెస్ మైనార్టీ నేతలు డిష్యుం డిష్యుం
ఫిరోజ్‌ఖాన్‌ను తోసేసిన ఉస్మాన్ అలీ హజ్రీ
సముదాయించే ప్రయత్నం చేసిన ప్రభుత్వ సలహాదారు వీహెచ్‌పైనా దాడికి యత్నం
హైదరాబాద్, మే 27(విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాల యం గాంధీభవన్‌లో బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్టీ పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో నాయకులు కొట్టుకున్నారు. మంత్రులు, సీనియర్ నేతల సమక్షంలోనే వారు భౌతిక దాడులకు దిగారు. పార్టీ వర్గాల్లో ఇది తీవ్ర కలకలం రేపింది.
మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్ సమక్షంలో సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రొటోకాల్ విషయంలో వివాదం మొదలైంది. ఈ క్రమంలో నాం పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఫిరోజ్‌ఖాన్, కార్వాన్ నియోజకవర్గ నేత ఉస్మాన్ అల్ హజ్రీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పక్క సీట్లో ఎవరు కూర్చోవాలనే విషయంలో మాటామాటా పెరిగింది. ఇద్దరూ పరస్పరం చొక్కాలు పట్టుకుని తోపులాటకు దిగారు.
ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ఆగ్రహంతో ఊగిపోతూ, మంత్రుల ముందే గొడవకు దిగారు. అనంతరం ఉస్మాన్ హాజారీ చెంపదెబ్బ కొట్టడంతో ఫిరోజ్‌ఖాన్ కింద పడిపోయారు. ఆ సమ యంలో పక్కనే ఉన్న ప్రభుత్వ సలహాదారు, పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు ఇద్దరిని సముదాయించే ప్రయత్నం చేశారు. వీహెచ్‌ను కూడా తోసేసే ప్రయత్నం చేయగా పక్కనే ఉన్న కార్యకర్తలు అడ్డుకున్నారు.
అయితే, మం త్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్ సమక్షంలోనే ఈ గొడవ జరగడం గమ నార్హం. మంత్రులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఇరువర్గాల నేతలు శాంతిం చలేదు. సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ జో క్యం చేసుకుని సమావేశాన్ని అర్థాంతరంగా ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొ ట్లాట మొదలుకాగానే మంత్రి మహ్మద్ అ జారుద్దీన్ గాంధీభవన్ నుంచి వెళ్లిపోయా రు. అధికారంలో ఉన్న పార్టీలో నాయకలు మధ్య ఇగోలు బహిర్గతమయ్యాయి.
క్షమాపణలు చెప్పాను: ఉస్మాన్
గాంధీభవన్‌లో జరిగిన గొడవవపై కా ర్వాన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఉస్మాన్ అల్ హజ్రీ స్పందించారు. ‘ఫిరోజ్‌ఖాన్‌కు క్షమాపణలు చెప్పాను. ఇద్దరు అన్న దమ్ముల మధ్య జరిగిన చిన్న గొడవ. మాది కాంగ్రెస్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో గొడవలు జ రుగుతూనే ఉంటాయి. నేను తోసేసింది చూ శారు. అంతకుముందు జరిగింది కూడా చూ డాలి’ అని ఉస్మాన్ అన్నారు.
మిస్ అండర్‌స్టాండింగ్ వల్లే: ఫిరోజ్‌ఖాన్
గాంధీభవన్‌లో గొడవ మిస్‌అండర్ స్టాం డింగ్ వల్లే జరిగిందని నాంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఫిరోజ్‌ఖాన్ అన్నారు. కుర్జీలో కూర్చోవడం విషయంలోనే ఇబ్బంది జరిగిందన్నారు. మంత్రి పక్కన కూర్చోవాలని అందరూ అనుకున్నారని తెలిపారు. ఉస్మాన్ అలీహజ్రీ ‘నాకు పెద్దన్న లాంటివాడని, నన్ను స్టేజీపైకి రమ్మంటే వెళ్లలేద’ని అన్నారు.






