12-03-2025 12:00:00 AM
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): తెలంగాణలో నేడు పీజీ ఈసెట్ నోటిఫికేషన్‌ను జేఎన్టీయూహెచ్ విడుదల చేయనుంది. ఈ నెల 17వ తేదీ నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్లు టీజీ పీజీఈసెట్ కన్వీనర్ డా.ఏ.అరుణ కుమారి తెలిపారు. ఇతరత్రా వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆమె సూచించారు.