25-11-2025 10:03:17 AM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రజలు యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో మత్తుకు బానిసలై విద్యను గాలికి వదిలేసి ఇస్తాను సారంగా వ్యవహరిస్తున్నారని మాత నుంచి విద్యార్థి మేల్కొని భవిష్యత్తు నడకలు ఉన్నత స్థాయికి చేరే విధంగా పాల్పడాలని ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ ఎల్లారెడ్డి పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో మత్తు పదార్థాల నిషేధిత అవగాహన సదస్సులు తెలిపారు.
విద్యార్థులకు మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని, డగ్స్,కోకైన్ విషయంలో ప్రధాన టార్గెట్ యువతను విద్యార్థులును చేస్తున్నారని, ప్రతి విద్యార్ది డ్రగ్స్ నివారణపై అవగాహన ఉండాలని, ఎల్లారెడ్డి ఆప్కారి శాఖ సీఐ షాకీర్ హైమద్ ఎల్లారెడ్డి ఆదర్శ పాఠశాలలో అవగాహన సదస్సులో పాల్గొని విద్యార్థులకు తెలిపారు. అనంతరం ఎల్లారెడ్డి,ఏ ఎస్సై, దేవా గౌడ్ మాట్లాడుతూ, ఎక్కడైనా గంజాయి కాని ఏ ఇతర డ్రగ్స్ అమ్ముతు ఉన్నా కోంటున్నా సమాచారం పోలిసులకు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలియజేయగలని,వాడడం వల్ల విచక్షణ కోల్పోయి తప్పులు చేయడం వల్ల కేసుల పాలు అవుతారని, ఆరోగ్యము చేడు పోయి శరీర అవయవాలు దేబ్బతింటాయని ,మీ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి కనుక మత్తు పానీయాలకు దూరంగా ఉండి, డగ్స్ రహిత సమాజం కోసం మీ యువకులు సహకరించి దేశానికే ధర్మానికి రక్షకులుగా ఉండలని, విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ యువకులు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో తెలిపారు.ఈ కార్యక్రమం
ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ సార్, ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ షాకీర్,హైమద్ ఎల్లారెడ్డి పోలీస్ శాఖ, దేవి హాస్పిటల్ వైద్యులు, యశ్వంత్ రామచంద్ర , మోడల్ హై స్కూల్ ప్రిన్సిపల్ గాంధీ , విశ్వహిందూ పరిషత్ ఎల్లారెడ్డి అధ్యక్షులు నవీన్, తులసి దాస్, వినోద్, భరత్, రాహుల్, సందీప్ బన్నీ ప్రకాష్ బజరంగ్ దళ్ కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు యువకులు తదితరులు పాల్గొన్నారు.