calender_icon.png 25 November, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెజ్జూర్ లో యోగ శిక్షణ పై ఆసక్తి చూపుతున్న ప్రజలు

25-11-2025 09:56:12 AM

 బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని ఆయుష్మాన్ భారత్ యోగ కేంద్రాల్లో యోగా చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని యోగ మాస్టర్ జనగామ లక్ష్మణ్, బొజ్జ కళావతి తెలిపారు. యోగ కేంద్రంలో పురుషులు, మహిళల కు యోగా చేసేందుకు ఓకే కేంద్రం ఉండడంతో ఇబ్బందిగా ఉందని తెలుపుతున్నారు. పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా యోగ కేంద్రాలు ఏర్పాటు చేసి వసతులు ప్రభుత్వం నుండి కల్పించేలా చూడాలని యోగ శిక్షకులు కోరుతున్నారు. యోగ చేయడంతో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. బి పి, షుగర్, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, అధిక బరువు, గ్యాస్ ట్రబుల్, ఆహారం జీర్ణం కాకపోవడం, రక్తపోటు, శ్వాస సమస్యలు, గుండె సమస్యలు అనేక సమస్యలు సైతం యోగా, ధ్యానం చేయడంతో నయమవుతాయని తెలిపారు. యోగ పై అపోహలు వీడి యోగ పై ప్రజలు ఆసక్తి చూపాలని మార్పు కోసమే యోగ చేయాలని తెలిపారు.