calender_icon.png 25 November, 2025 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెజ్జూరులో దొంగ అరెస్ట్

25-11-2025 10:00:17 AM

బెజ్జూర్, (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో చోటుచేసుకున్న దొంగతన కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకొని జ్యూడిషల్ రిమాండ్‌కు పంపించారు. ఇటీవల మండల కేంద్రంలోని ఒక వ్యక్తి ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన వాహనాన్ని ఒక దొంగ అపహరించిన సంఘటన చోటుచేసుకున్నది. ఈ ఘటన అనంతరం నిందితుడు పోలీసుల దృష్టికి చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.ఈ నేపథ్యంలో, ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన పోలీసులు నిందితుడిని ఈరోజు పట్టుకొని, అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసి జ్యూడిషల్ రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి దొంగతనాలను ఏమాత్రం ఉపేక్షించబోమని, దొంగతనాలకు పాల్పడిన వారిని పట్టుకొని బాధితులకు న్యాయం చేయడం తమ బాధ్యత అని పోలీసు అధికారులు తెలిపారు.పోలీసుల వేగవంతమైన చర్యలను సాధారణ ప్రజలు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.