calender_icon.png 25 November, 2025 | 11:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం

25-11-2025 09:54:26 AM

బెజ్జూర్, (విజయక్రాంతి): ఆసిఫాబాద్  జిల్లా లో జరిగినటువంటి జోనల్ స్థాయి క్రీడలలో బెజ్జూరు మండలంలోని సోమిని గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు.వారిలో పదవ తరగతి విద్యార్థులు. వడాయి విగ్నేష్ సీనియర్ విభాగంలో 400 మీటర్ల పరుగు పందెంలో జిల్లా స్థాయి మొదటి బాహుమతి సాధించాడు. 200 మీటర్ల పరుగు పందెం లో ద్వితీయ బహుమతి జూనియర్ విభాగంలో బండి అరుణ్, 400 మీటర్ల పరుగు పందెంలో మొదటి బహుమతి, జూనియర్ విభాగంలో కొట్రంగి. మహేష్ బాబు 100 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ బహుమతి సాధించారు. వాలీబాల్ జూనియర్ విభాగంలో సిడం సాయి కుమార్,తొర్రెమ్ అజయ్ లు రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ కావడం జరిగిందని ప్రధానోపాధ్యాయుడు బిక్షమయ్య తెలిపారు. విద్యార్థులను ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి సన్మానించి విద్యార్థులను ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి సన్మానించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.