calender_icon.png 25 November, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్సైజ్ సీఐకి అభినందనలు తెలిపిన యూనియన్ నేతలు

25-11-2025 09:58:10 AM

హనుమకొండ,(విజయక్రాంతి): హసన్పర్తి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా, ఎక్సైజ్ యూనియన్ సభ్యులు సీఐ దుర్గ భవానికి, ఎక్సైజ్ అధికారులకు, నూతన సిబ్బందికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ యూనియన్ నాయకులు, నూతన స్టేషన్ ద్వారా అక్రమ మద్యం, మత్తు పదార్థాల నివారణ మరింత పటిష్టం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో యూనియన్ ప్రెసిడెంట్ ఎండీ. రబ్బాని, జనరల్ సెక్రటరీ బొల్లెపల్లి రమేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్లుగా లింగేశ్వర్, ముత్యాల రమేష్, జాయింట్ సెక్రటరీ గుర్రపు రాజమౌళి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తాళ్ల వెంకటేష్, ప్రెస్ సెక్రటరీ వి.శరత్ కుమార్ లు పాల్గొని నూతన స్టేషన్ విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.