ఆధునిక సమాజ అక్షర యోధుడు ఫూలే
- దళిత బహుజన తత్వవేత్త ప్రొఫెసర్ కంచ ఐలయ్య
అంబేద్కర్‌నగర్‌లోపూలే విగ్రహావిష్కరణ
పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్
జవహర్‌నగర్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): అణగారిన వర్గాలకు అక్షర యోధు డు మహాత్మా జ్యోతిరావు పూలే నేనని ఉత్పత్తి కులాల్లో విద్యతోనే వివేకం ఉద్భవిస్తుందని ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ఐక్యరాజ్యసమితిని శాసించే స్థాయికి తీసుకపోతుందని మహిళలు చదువుకుంటేనే భవి ష్యత్ తరాలకు దిక్సూచి అవుతుందని ప్రతి ఒక్కరి జీవితంలో విద్య వివేకవంతులను చేస్తుందని ప్రపంచ మేధావి ప్రొఫెసర్ కంచ ఐలయ్య పిలుపునిచ్చారు.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్‌నగర్‌లోని అంబేద్కర్ నగర్లో మహనీయుల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మండల సురేందర్ తదితరుల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కంచ ఐలయ్య హాజరై మాట్లాడుతూ చదువుకు పూలేను దూరం చేయాలని కొన్ని శక్తులు అడ్డు తిరిగినా వెనకడుగు వేయకుండా మొక్కవోని దీక్షతో చదివి దేశంలోనే ఆదర్శవంతుడయ్యాడని సాంఘిక దురాచారాలు మూఢనమ్మకాలు విద్యతోనే అంతమ వుతాయి అన్నారు.
అనంతరం పూలే విగ్ర హ దాత కాగిత రాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మేడ్చల్ డిసిసి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, ఎమ్మెల్సీ సత్యం, నెల్లికంటి శరత్, నల్ల రాధాకృష్ణ, వజ్రేష్ యాదవ్, మాజీ మేయర్ మేకల కావ్య, మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, జవహర్ నగర్ నాయకులు శ్రీకాంత్ యాద వ్, శంకర్ గౌడ్, మహనీయుల ఉత్స వ కమిటీ ప్రధాన కార్యదర్శి పరుశురాం, కార్యదర్శి ఎర్రగుడ్ల వెంకటేశ్వర్లు, పలు రాజకీయ కుల సంఘాల సభ్యులు, మేధావులు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.




