ఫూలే సేవలు చిరస్మరణీయం
బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లిఖార్జున్
సికింద్రాబాద్, ఏప్రిల్11 (విజయక్రాంతి): కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి, సమాజంలో సమానత్వం,విద్యా విస్తరణకు మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లి కార్జున్ అన్నారు.జాతీయ బిసి ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యం లో బాపుజీనగర్ ధనలక్ష్మి కాలనీ లో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
జాతీయ బిసి ప్రజా చైతన్య వేదిక ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లి కార్జున్ ముఖ్య అతిథిగా హాజరై వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బిసి ప్రజా చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్, నియోజకవర్గ సమన్వయకర్త ఓం ప్రకాష్,రాయల్ కుమార్,బండి శ్రీనివాస్ నేత, బిజెపి నాయకులు పాల్గొన్నారు.




