12 April, 2026 | 2:04 AM

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

12-04-2026 12:00 AM

మేడిపల్లి,ఏప్రిల్ 11 (విజయక్రాంతి): మూసీ నాలాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. .పీర్జాదిగూడ మహారాజా కోట పక్కన ఉన్న మూసీనాల పరిధిలో శనివారం సాయం త్రం 5 గంటలకు ఒక గుర్తు తెలియని వ్యక్తి (45)మృతదేహం లభ్యమైంది.

మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలో దర్యాప్తు నిమిత్తం భద్రపరిచారు. మృతుని వివరాలు తెలిసినట్లయి తే ఎవరైనా గుర్తుపట్టినట్లయితే మేడిపల్లి పోలీస్ స్టేషన్ వారి 8712662702, 8712662172 నంబర్లకు సమాచారం ఇవ్వగలరని సీఐ శంకరయ్య తెలిపారు.