పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి
12-08-2026 12:34 AM
ప్రధాని మోదీకి వీహెచ్ లేఖ
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి) : జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్యను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు అన్నారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున పింగళీ వెంకయ్యకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రధానికి లేఖ రాశారు. ఇదే కాపీని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి కూడ పంపించినట్లు వీహెచ్ తెలిపారు.






