12 August, 2026 | 2:26 AM

ఓనమాలు నేర్చిన పాఠశాలకు.. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత

12-08-2026 01:30 AM

తుంగతుర్తి, ఆగస్టు 11 :చిన్ననాటి ఓనమాలు నేర్చిన పాఠశాలపై ఉన్న మమకారాన్ని చాటుకుంటూ, వెంపటి గ్రామ మాజీ ఉపసర్పంచ్ భాష బోయిన వెంకన్న తనవంతు సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. మండల పరిధిలోని వెంపటి ప్రాథమిక పాఠశాలకు తన తన తల్లిదండ్రులైన భాష బోయిన అంజయ్య - ఉప్పలమ్మ ల జ్ఞాపకార్థం డ్రమ్ము లను గ్రామస్తుల చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బివనపల్లి శ్రీనివాస్ కు అందజేశారు.వెంకన్న వెంపటి ప్రాథమిక పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకొని, అనంతరం ప్రజాజీవితంలోకి అడుగుపెట్టి గ్రామ మాజీ ఉపసర్పంచ్గా రాజకీయ నాయకునిగా ఎదిగారు.

తాను ఎదగడానికి పునాది వేసిన పాఠశాలను, అక్కడి ఉపాధ్యాయులు అందించిన విద్యా బోధనను ఎప్పటికీ మరువకుండా పాఠశాల అవసరాలకు తనవంతు సహకారం అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకాలను కేవలం ఇంటికే పరిమితం చేయకుండా, విద్యార్థులకు ఉపయోగపడే సేవా కార్యక్రమంగా మలచడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దాసరి మంజుల రామచంద్రు, వార్డు సభ్యుడు పులిగుజ్జ నరసయ్య,మాజీ సర్పంచ్ అబ్బగాని సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మాదరబోయిన రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సూదగాని రాజయ్య, సగ్గం నరసయ్య, చంటి వెంకన్న,బోళ్ల నరసయ్య, చిర్ర దిలీప్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.