3 April, 2026 | 7:11 AM

పోలీసుల అదుపులో పిస్తోల్ వ్యాపారి

03-05-2024 12:19 AM

మేడ్చల్, మే 2 (విజయక్రాంతి) : నగరశివారులో జరిగిన వాహన తనిఖీల్లో పిస్తోళ్ల వ్యాపారిని జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల, బాలానగర్ ఎస్‌ఓటీ పోలీసులు బుధవారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా కుత్బుల్లాపూర్ సర్కిల్ అయోధ్యనగర్‌కు చెందిన గుడ్డి వంశీకృష్ణగౌడ్ ఒక యాక్టివా వాహనంపై అనుమానం గా వస్తుండగా తనిఖీ చేశారు. అతని వద్ద పిస్తోల్, 3 బుల్లెట్లు దొరకడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. సంవత్సరం క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశాల్‌యాదవ్ అనే యువకుడు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై తాను పిస్తోళ్ల వ్యాపారం చేస్తున్నానని చెప్పాడు. తాను ఆయుధాలు సరఫరా చేస్తానని హైదరాబాద్‌లో మంచి బిజినెస్ ఉంటుందని నీకు ఆయుధాలు సరఫరా చేస్తానని వంశీకృష్ణగౌడ్‌ను ఒప్పించాడు. మార్చి 6న విశాల్ యాదవ్ వరంగల్ జిల్లా ఖాజిపేటకు వచ్చనని చెప్పడంతో వంశీకృష్ణగౌడ్ యాక్టివా వాహనంపై వెళ్లాడు. రూ. 30వేలు చెల్లించి 3లైవ్ బుల్లెట్లతో కూడిన పిస్తోల్ తీసుకుని కుత్బుల్లాపూర్‌కు తిరిగి వచ్చాడు. బుధవారం రాత్రి పోలీసు లు తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డాడు. ప్రస్తు తం వంశీ పోలీసుల అదుపులో ఉన్నాడు.