3 April, 2026 | 5:13 AM

జోరందుకున్న కాంగ్రెస్ ప్రచారం

03-05-2024 12:23 AM


నారాయణఖేడ్, మే 2 : నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం జోరందుకుంది. గురువారం నాగల్‌గిద్ద మండ లంలో కాంగ్రెస్ కార్యకర్తల విసృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేశ్ షెట్కార్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఎంపీ ఎన్నికల్లో సురేశ్ షెట్కార్‌ను అత్యధిక మెజార్టీతో గెలుపొందెందుకు కృషి చేయాలన్నారు. సిర్గాపూర్ మండలంలోని నల్లా వాగులో కాంగ్రెస్ జిల్లా నాయకులు శేఖర్‌రెడ్డి, నగేశ్ షెట్కార్ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఉపాధిహామీ కూలీలతో వారు మాట్లాడి కాంగ్రెస్‌కు ఓటు వేసి సురేశ్ షెట్కార్‌ను గెలిపించాలని కోరారు. 

కాంగ్రెస్‌లో చేరికలు

నాగల్‌గిద్ద మండలం శేరిదామర్‌గిద్ద గోప్యానాయక్ తండాల్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున్న కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయన వెంట ఎంపీటీసీ పండరినాథ్‌రావు పాటిల్ ఉన్నారు.