వందరోజుల కార్యాచరణపై ప్రణాళిక
రాజేంద్రనగర్, మే 28: కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక తయారు, అమలు అంశంపై రోజువారి ప్రణాళిక రూపకల్పన కోసం బుధవారం సాయంత్రం 4 బండ్లగూడ జాగీర్ పరిధి కిస్మత్ పూర్ లోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ శరత్ చంద్ర కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆదేశముల మేరకు రోజువారి పనులపై కార్యాచరణ రూపకల్పనకు వార్డు అధికారులు సంబంధించిన వార్డులలో పర్యటించి సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
మార్గదర్శకాలను అనుసరించి వార్డు వారిగా సమస్యలు గుర్తించడం, పరిష్కరించడం మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కమిషనర్ శరత్ చంద్ర సూచించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ మంజులత, డిప్యూటీ ఈఈ యాదయ్య, ఆర్ ఓ శివకుమార్, ఏఈఈ రాజ్ కుమార్, వివిధ సెక్షన్ల అధికారులు, సెక్షన్ అసిస్టెంట్లు, వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, ఆపరేటర్లు, శానిటరీ జవాన్లు పాల్గొన్నారు.






