31 July, 2026 | 1:11 AM

మొక్కలు భావితరాలకు ఉపయోగకరం

31-07-2026 12:00 AM

ఘట్ కేసర్, జూలై 30 (విజయక్రాంతి): నాటిన ప్రతి మొక్క పెరిగి చెట్లుగా భావితరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జం గయ్య యాదవ్ అన్నారు. ఘట్ కేసర్ డివిజన్ పరిధిలో మాజీ ఎంపిటిసి నందం గణేష్ బాబు ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ పాల్గొని గాంధీనగర్ స్మశాన వాటిక పరిసరాల్లో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలలో చెట్లను నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని, నాటిన ప్రతి మొక్కను పరిరక్షించాలన్నారు. పెరిగిన ప్రతి మొక్క చెట్లుగా భావి తరాలకు ఎంతో ఉపయోగపడతాయని దీని ద్వారా ఆక్సిజన్, మంచి గాలి, వర్షాలు విస్తారంగా కురుస్తాయని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని కర్తవ్యం గా భావించి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి యొక్క సంరక్షణ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్, మాజీ వార్డు సభ్యులు బర్ల దేవేందర్ ముదిరాజ్, సల్లూరి నర్సింగ్ రావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.