బీసీ ఉద్యోగులపై అక్రమ కేసులు పెట్టొద్దు
- మలక్పేట్ సీఐ నరసింహ గౌడ్ సస్పెన్షన్ ఎత్తివేయాలి
- బీసీ సంఘాల డిమాండ్
ముషీరాబాద్, జూలై 30(విజయక్రాంతి): బీసీ ఉద్యోగులపై వేధింపులు, నిరాధార ఆరోపణలు, అక్రమ కేసులు పెట్టొద్దని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యని ర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, పోస్టింగుల్లో ప్రాధాన్యత కల్పించకుండా మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మ లక్పేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహ గౌడ్ పై విధించిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేసి, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. బీసీ ఉద్యోగులపై తప్పుడు ప్రచారాలు, నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపర మైన చర్యలు తీసుకోవాలని, అక్రమ కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు ఈడిగ శ్రీనివాస్ గౌడ్, ఇంద్రం రజక, తొడుపునూరి సత్యం గౌడ్, గుంటి మహేష్, బండిగారి రాజు తదితరులు పాల్గొన్నారు.






