17 April, 2026 | 2:29 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ప్లాస్టిక్‌తో పర్యావరణానికి విఘాతం

05-06-2025 12:00 AM
  1. మైక్రో ప్లాస్టిక్, నీరు, ఆహారం ద్వారా మానవ శరీర భాగాల్లోకి ప్రవేశం.. క్యాన్సర్‌కు కారకం?

జీవగ్రహాన్ని అతలాకుతలం చేస్తున్న సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

మంచిర్యాల, జూన్ 4 (విజయక్రాంతి): జీవరాశులకు పరిసరాలకు మధ్యగల సం బంధమే పర్యావరణం... మన చుట్టూ ఉన్న  వృక్ష సంపద, జంతువులు, సూక్ష్మజీవులు, నేల, నీరు, గాలి ఇవన్నీ పర్యావరణంలో భాగాలే. భూగోళంపై నివసిస్తున్న అన్ని జీవులతో మానవునికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉంది. జీవితంలో మనిషికి ఎన్నో అవసరాలు ఉన్నాయి. పీల్చే గాలి, త్రాగే నీరు, ఆశ్రయానికి గూడు, ఆహారం ప్రతిదీ ప్రకృతి సంపదే. ఏవి లేకుండా మని షి జీవించలేడు.

ఇలా మానవునికి, పర్యావరణానికి అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. ప్రాథమిక అవసరాలకై ప్రకృతిపై ఆధారపడి జీవించాడు.  క్రమక్రమంగా విచక్షణ రహితంగా ప్రవర్తించడం వలన సమతు ల్యత భంగపడి పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యింది. ఈ పాపానికి కారణం కేవలం నేటి ఆధునిక మానవుడే.

జూన్ 5 ఇలా ప్రారంభమైంది...

ఐక్యరాజ్యసమితి 1970లో పర్యావరణ రక్షణకై నైరోబీలో అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేసి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ప్రారంభించింది. 1972లో స్టాక్ హోమ్ లో జరిగిన ఫస్ట్ ఎర్త్ కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్ జూన్ 5న మానవ పర్యావరణం అంశం చర్చల ఫలితంగా భారత ప్రభుత్వం 1986 లో పర్యావరణ రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టిం ది. దీని ద్వారా పర్యావరణాన్ని రక్షించడం, కాలుష్యాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం అధికారం ఇచ్చింది .

ప్రపంచ ఆరోగ్య సంస్థ 1990లో పర్యావరణ పరిరక్ష ణ సంవత్సరంగా ప్రకటించింది. ప్రపంచంలోనే ప్రప్రథమంగా మనదేశంలో పర్యావర ణ న్యాయ స్థానాలనుఏర్పాటు చేసి నేరస్తులను క టినంగ శిక్షించుటకు అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ మాత్యులు మేనకా గాంధీ నిశ్చయించారు.

సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ మానేసే దిశగా ముందడుగులు పడాలి

ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమ స్య పర్యావరణ సంక్షోభం. పర్యావరణ కాలు ష్యం అణుబాంబు విస్ఫోటనం కన్నా అతి ప్రమాదకరమైనది. ఇది మానవునితో పాటు కోటానుకోట్ల జీవ జాతులు జీవించే హక్కు ను హరించి వేస్తుంది. పర్యావరణంలో మ మేకమై జీవనం సాగించాల్సిన మానవుడు క్రమక్రమంగా ఇతర జీవుల ఉనికి పెను ప్రమాదాన్ని కలిగించే విధ్వంస పోకడలకు తెగబడటమే పర్యావరణ కాలుష్యానికి మూ ల కారణం.

ప్రధానంగా సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ ను ఆపకపోతే మన ముందు పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. పర్యావరణ కాలుష్యం యావత్ ప్రపంచ సమస్యగా భావించి కోపెన్ హగ్ పర్యావరణ రక్షణ పై సదస్సు జరిపి ఐక్యరాజ్యసమితిలో ఆమోదింపజేసి పలు తీర్మానాలు చేయడం జరిగింది. చట్టాలు ఎన్ని చేసినప్పటికీ వాటిని నిబద్ధతతో అమలు చేయడంలో నిర్లక్ష్యం చేయడం వలన ఫలితం శూన్యం.

పర్యావరణ మిత్ర అలవాట్లు ఇలా..

ప్రతి వ్యక్తి తనపుట్టిన రోజుతో పాటు అన్ని శుభకార్యాలు, వివిధ సందర్భాలలో మొక్కలు నాటి సంరక్షించాలి. సహజ వనరులు ఇంధనాలను పొదుపుగా వాడుకోవాలి. మొదలు పర్యావరణ మిత్ర వస్తువులు ఉపయోగించా లి. అడవులను వన్య జీవులను సంరక్షించుకోవాలి. దూరప్రయాణాలు వ్యక్తిగత వాహనాల కు బదులు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్‌ను వినియోగిం చాలి.

కాలుష్యాన్ని నివారించి గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టాలి. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు  అవలంబించాలి. అన్ని జీవులను ప్రేమి స్తూ కాపాడాలి జీవవైవిధ్యాన్ని  కాపాడాలి. ప్రజల్లో, విద్యార్థుల్లో, యువతలో అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం ఇచ్చిన సంస్థ కృషి చేయాలి. పర్యావరణ చట్టాలను అందించిన వారిని కఠినంగా శిక్షించాలి.

అవసరాల మేరకే వాడుకోవాలి

వనరులను అవసరాల మేరకే చాలా పొదుపుగా ఉపయోగించుకుంటూ పరిరక్షించాలి. పరిరక్షణను విస్మరించడం వలన ఎన్నో ఉపద్రవాలు, సమస్యలు మానవాళిని ఉక్కిరి బిక్కిరి  చేస్తున్నాయి. ముందుచూపు లేని మానవ చర్యలు పర్యావరణ వినాశ నానికి కారణం అవుతున్నాయి. మితిమీరిన స్వార్థపూరిత కోరికలను మానుకొని ప్రకృతి సంపదను,

సహజ వనరులను, పర్యావరణ ఫలాలను భారత రాజ్యాంగంలోని 51/A ఆర్టికల్ ప్రకారం,1986 భారత పర్యావరణ చట్టం ప్రకారం అవసరమైనంత మాత్ర మే వాడుకుని ఇతరులకు భావితరాలకు మానవ దర్భంగా పొదుపు చేయాలి. పర్యావరణానికి మిత్రులుగా మారి మనుగడ సాగిస్తేనే రేపటికి భావితరాలు అనేవి ఉంటాయి.  సంరక్షణ చర్యలు చేపట్టకుండా పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. 

్ర గుండేటి యోగేశ్వర్, పర్యావరణవేత్త