19 August, 2026 | 8:45 PM

బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం

13-05-2026 04:02 PM

ఎల్లారెడ్డిపేట,(విజయక్రాంతి): రాచర్ల బొప్పపూర్ గ్రామంలో బుధవారం రోజు జరిగిన  పాలకవర్గం సాధారణ సర్వసభ్య సమావేశం సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి అధ్యక్షతన నిర్వహించడం జరిగిందన్నారు.ఇట్టి సమావేశంలో గ్రామంలో పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించడం జరిగిందని, గ్రామంలో జరిగే ఎలాంటి కార్యక్రమాలకు అయిన కుడా ప్లాస్టిక్ ప్లేట్లను ప్లాస్టిక్ గ్లాసులను వాడకూడదు అని నిర్ణయించడం జరిగిందన్నారు. గ్రామంలో జరిగే శుభాకార్యలకు గ్రామ పంచాయతీ తరుపున స్టిల్ ప్లేట్లను మరియు స్టీల్ గ్లాసులను అందుబాటులో ఉంచుతామని సర్పంచ్ ఇల్లేందుల గీతాంజలి-  శ్రీనివాస్ రెడ్డి లు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండాపురం వెంకట్ రెడ్డి మరియు కార్యదర్శి సంతోష్ వార్డు మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు.