ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలి
చెల్పూర్‌లో ఎంజీఎం విద్యార్థుల అవగాహన ర్యాలీ
గణపురం, ఆగస్టు 25 (విజయక్రాంతి): మండలంలోని చెల్పూర్ ఎంజీఎం హైస్కూల్ ప్రాథమిక విద్యార్థులు ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మంగళవారం ర్యాలీ నిర్వహించారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు పాల్గొన్న ర్యాలీలో ప్లాస్టిక్ కవర్లు, వస్తువుల వినియోగంతో పర్యావరణానికి కలిగే నష్టాలను వివరిస్తూ నినాదాలు చేశారు.
ప్లాస్టిక్ కవర్లకు బదులుగా కాగితపు కవర్లు, వస్త్ర సంచులను వినియోగించాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జి. సతీష్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కావటి రవీందర్, ఉపసర్పంచ్ మల్హర్రావు, కొత్త వెంకన్న, డాక్టర్ స్వాతి, ప్రిన్సిపాల్ మధుకర్, డైరెక్టర్లు శ్రీనివాస్, తిరుపతి, రమాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






