26 August, 2026 | 3:44 AM

కాంగ్రెస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక

26-08-2026 12:36 AM

వెంకటాపూర్, ఆగస్టు 25 (విజయక్రాంతి): మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నికను మంగళవారం నిర్వహించగా, ఈ ఎన్నికల్లో గ్రామ కమిటీ నూతన అధ్యక్షుడిగా జాకీర్ హుస్సేన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని, గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తల సమన్వయంతో పనిచేస్తానని, అలాగే గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుగుణ, ఉప సర్పంచ్ రాజు, రామప్ప ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఐలయ్య, ఎన్‌ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు కోటి, మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీను, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.