23-02-2026 12:05:42 AM
బోన్ మారో క్యాన్సర్ తో బాధపడుతున్న బాలుడు
ఎర్రుపాలెం, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): తమ కుమారుడు సాయి భావేష్ బోన్ మారో క్యాన్సర్ తో బాధపడుతున్నాడని డాక్టర్లు వైద్యం కోసం 10 లక్షలు ఖర్చు అవుతుందని, అంత ఖర్చును భరించే స్తోమత మా దగ్గర లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తమ కుమారుడిని ఆదుకొని వైద్యం అందించాలని తల్లి దండ్రులు వేడుకుంటున్నారు. సాయి భావేష్ అనే ఈ బాలుడు ఎర్రుపాలెం గ్రామనికి చెందిన పసుపులేటి కృష్ణప్రసాద్ కుమారుడు .
ఇతనికి బోన్ మారో క్యాన్సర్ ప్రస్తుతం బసవతారకం హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు పేర్కొన్నారు. సాయి బానేష్ తల్లిదండ్రులు తమ కుమారున్ని దాతలు విరాళాలు అందించి ఆదుకొని తమ బిడ్డను రక్షించాలని వేడుకుంటున్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి 8897886446 , 814204669 ఈ నెంబర్లకు కు ఫోన్ పే చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మీకు తోచినంత సాయం చేసి తమ కుమారుడి ప్రాణాన్ని కాపాడాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.