14-08-2025 12:41:45 AM
మణుగూరు, ఆగష్టు 13,(విజయ క్రాంతి) :ఏరియా జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జిఎం దుర్గం రామచందర్ ఉద్యోగులతో కలసి మాదకద్రవ్యాల నిరోధకంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు గంజాయి రవాణా మొదలై నటువంటి అంశాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని నియంత్రించడానికి కృషి చేయాలని కోరారు.
సమాజంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మూలంగా అనేక కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నిరోధక చర్యల్లో కంపెనీ ఎల్లప్పుడూ సామాజిక బాధ్యతలో భాగంగా అవగాహన కార్యక్ర మాలను నిర్వహిస్తూ, సమాజంలో సానుకూల మార్పులను తీసుకు రావడానికి బాధ్యతా యుతంగా కృషి చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఏరియా రక్షణ అధికారి వెంక టరామారావు, డీజీఎం (పర్స న ల్) సలగట్ల రమేష్ , డిజి ఎం (ఫైనాన్స్) శ్రీమతి ఎం అనురాధ , ప్రాజెక్ట్ ఇంజనీర్ పికేఓసి వీరభద్రుడు, సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్, పర్యావరణ అధికారి శ్రీనివాసరావు , పర్సనల్ మేనేజర్ తిరుపతి, జిఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.