14-08-2025 12:40:00 AM
వైరా, ఆగస్టు 13 (విజయ క్రాంతి ): కేంద్ర మాజీ మంత్రి,రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకొని టిపిసిసి ప్ర ధాన కార్యదర్శి కట్ల రంగారావు ఆధ్వర్యంలో వైరాలో బుధవారం ఘనం గా నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జన్మదిన కేక్ ను కట్ల రంగారావు తో పాటు రాష్ట్ర మాజీ మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా. రాజశేఖర్, వైరా మాజీ మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, మండల కాం గ్రెస్ అధ్యక్షులు శీలం.వెంకట నర్సిరెడ్డి కలిసి కేక్ ను కట్ చేశారు.
మిఠాయిలు పంచిపెట్టారు.అనంతరం వైరా మండల పరిధిలోని గొల్లపూడి గ్రామం లోని వృద్ధాశ్రమం నందు వృద్ధులకు, అనాధ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు మాట్లాడుతూ రేణుక చౌదరి కార్పొరేటర్ స్థాయి నుంచి జాతీయస్థాయిలో కేంద్ర మంత్రివర్యులుగా ఎన్నో పదవులను అలంకరించి ఖమ్మం జిల్లా ఆడబిడ్డగా జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరిన్ని ఉన్నత పదవులు అదిరోదించాలని భద్రాచల సీతారాముల వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బిడికే రత్నం,ఎస్డి అన్వర్, రేచర్ల నాగేశ్వరరావు, మిట్టపల్లి నాగి, రేచర్ల రాముడు, ధర్నా రాజశేఖర్, గుత్తికొండ. వీరబాబు, రాచబంటి.రామకృష్ణ, తేజావత్ రామకృష్ణ, కట్ల సంతోష్, కట్ల నాగరాజు, ఎస్కే మోషిన్, రేచర్ల సత్యం, జాలాద్రి రామకృష్ణ, రేచర్ల పుల్లయ్య, య మాల భాస్కర్, దేవిశెట్టి సైదులు, మణిదీపు, మూల దుర్గా ప్రసాద్, వైరా నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గరిడేపల్లి కిషోర్, తెలగవరపు సురేష్, తదితరులు పాల్గొన్నారు.