19-11-2025 10:30:19 AM
పుట్టపర్తి: ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) పుట్టపర్తి చేరుకున్నారు. పుట్టపర్తిలో(Puttaparthi) సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీకి ఏపీ గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో ఉన్న శ్రీ సత్యసాయి బాబా పవిత్ర మందిరం, మహాసమాధిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్శించి, ఆయనకు నివాళులు అర్పించారు. ప్రధాని వెంట ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు.