calender_icon.png 19 November, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరాగాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ

19-11-2025 09:04:43 AM

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ జయంతి(Indira Gandhi Jayanti) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) బుధవారం ఆమెకు నివాళులర్పించారు. "మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు" అని మోడీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. 1917 నవంబర్ 19న జన్మించిన ఇందిరా గాంధీ 1966 నుండి 1977 వరకు, ఆ తర్వాత 1980 నుండి 1984 అక్టోబర్ 31న ఆమె హత్యకు గురయ్యే వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు.