28-11-2025 07:03:15 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయ క్రాంతి): బెల్లంపల్లి పట్టణ ఫ్రూట్ మర్చంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. పట్టణంలోని ఎల్లమ్మ గుడి ఆవరణలో శుక్రవారం ఈ ఎన్నిక ను నిర్వహించారు. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మహమ్మద్ గౌస్ బాయ్, ఉపాధ్యక్షుడిగా షేక్ ఫైన్ కోశాధికారిగా మేడిపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శిగా అస్లాం మహమ్మద్ షేక్ బాబా, సహాయ కార్యదర్శిగా ఆసంపల్లి గోపి, న్యాయ సలహాదారుగా హైకోర్టు న్యాయవాది మహమ్మద్ ఇమ్రాన్ లను ఏకగ్రీయంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్ భాయ్ మాట్లాడుతూ... ఫ్రూట్ పర్సెంట్ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. రోడ్డు విస్తరణలో షాపులు తోపుడు బండ్లు కోల్పోయిన ఫ్రూట్ వ్యాపారులకు తగు స్థలాలు కేటాయించి పునరావాసం కల్పించాలని కోరారు. తన నియామకానికి, నూతన కమిటీని ఏకగ్రీవ కోసం కృషి చేసిన ప్రతి సభ్యులకి గౌస్ కృతజ్ఞతలు తెలిపారు.