28-11-2025 06:53:01 PM
నిర్మల్,(విజయక్రాంతి): జన విజ్ఞాన వేదిక నిర్మల్ జిల్లా అధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి పరీక్ష పోటీలు స్థానిక జేవీఎన్ఆర్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పరీక్ష పేపర్లను పాఠశాల ప్రిన్సిపాల్ మణి కుమారి, జిల్లా సైన్స్ ఆఫీసర్ వినోద్ కుమార్, విడుదల చేసి పరీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ పరీక్షలు భవిష్యత్తులో జరిగే పోటీ పరీక్షలను ఎదుర్కోవటంలో తార్కిక, హేతుబద్ధమైన అవగాహన కలుగ జేస్తుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా హాజరయిన జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు గజపల్లి నర్సయ్య మాట్లాడుతూ సైన్స్ అనేది సత్యం అని సైన్స్ ను సైన్స్ లానే చదివి అర్థం చేసుకోవాలని, సైన్స్ ను బట్టి పెట్టడం వలన లేదా కథలా చదవటం వలన సత్యాన్ని గ్రహించక విద్యావంతులు కూడా మూఢ నమ్మకాలు నమ్మి ధన, ఆరోగ్య పరంగా నష్ట పోవడం జరుగుతుందని తెలిపారు.మొత్తం 19 మండలాల నుంచి 42 జట్లు పరీక్షలో పాల్గొన్నాయి.
అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ తెలుగు మీడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ధనిక,మధులత, నంద కుమార్, ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దివాకర్ పూర్ నిఖిల్ రాజ్, సుజలా, సుమిత్, రెసిడెన్షియల్ కెజిబివి ముధోల్ గీతాంజలి, అఖిల, ఐశ్వర్య, ప్రైవేట్ విన్నర్స్ హైస్కూల్ నిర్మల్ రాష్ట్ర స్థాయి చెకుముకి పోటీలకు అర్హత సాధించారు.