28-11-2025 06:57:12 PM
నస్పూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని ఆక్స్ ఫర్డ్ హై స్కూల్ లో ఈ నెల 26 నుంచి 28 వరకు నిర్వహించిన ఇన్ స్పైర్ సైన్స్ ఫేర్ లో మంచిర్యాల చుక్కా రామయ్య పాఠశాల స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలందించి అందరి మన్ననలు పొందారు. వెయ్యికి పైగా ఎగ్జిబిట్లు, మూడు వేల మంది విద్యార్థులు, 500 మంది ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ సైన్స్ ఫేర్ లో స్కౌట్స్ అండ్ గైడ్స్ (Scouts and guides) సేవా భావాన్ని ప్రదర్శించారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు తరగతి గదుల్లోకి వెళ్లి ప్రతి ఎగ్జిబిట్ (Exhibit)ను పరిశీలించేలా మార్గనిర్దేశం చేయడం, ఆహారం అందించడం, తదితరాలతో సేవ, క్రమశిక్షణ, వినయం అంటే ఏంటో నిరూపించారు. మన స్కౌట్స్ అండ్ గైడ్స్ చేసిన సేవా కార్యక్రమంపై విద్యార్థులతో పాటు పాఠశాల కరస్పాండెంటు దుర్గా ప్రసాద్ ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్యలు అభినందించారు.