calender_icon.png 28 November, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల షెడ్యూల్లో బీసీలకు అన్యాయం

28-11-2025 06:44:16 PM

బీసీ సంఘం మండల కన్వీనర్, లక్కినేని సురేందర్ రావు

టేకులపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన స్థానిక ఎన్నికల షెడ్యూల్ లో జనరల్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని టేకులపల్లి మండల బీసీ సంఘం కన్వీనర్ లక్కినేని సురేందర్ రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని వీరబ్రహ్మద్రస్వామి దేవాలయంలో శుక్రవారం అత్యవసరంగా ఏర్పాటుచేసిన బీసీ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టేకులపల్లి మండలంలో అన్ని గ్రామ పంచాయతీలలో జనరల్, వార్డులను ఎస్టీలకు, ఎస్టి వార్డులను జనరల్ అభ్యర్థులకు కేటాయించారన్నారు. 

అంతేకాక  జనరల్ స్థానాలు కావడం వలన ఎస్టీలు కూడా ఆ వార్డులకు పోటీ చేసే అవకాశం ఉన్నందున జనరల్ అభ్యర్థులు పోటీ చేసిన గెలిచే అవకాశం లేదని వాపోయారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని జనరల్ అభ్యర్థులకు న్యాయం చేసేందుకు అన్ని పార్టీల అగ్ర నాయకులు ఆలోచించాలని కోరారు. జనరల్ స్థానాలలో జనరల్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలని ఆయన కోరారు. మళ్ళీ దీనిపై చర్చించేందుకు శనివారం ఉదయం 10 గంటలకు మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం వద్ద బీసీ సంఘం, మైనార్టీ, ఓసి సంఘాల సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల గురించి అన్ని కుల సంఘాల నాయకులతో చర్చించి తదుపరి కార్యచరణ చేపట్టనున్నట్లు తెలిపారు.