calender_icon.png 28 November, 2025 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించండి

28-11-2025 07:10:55 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ పునరావాస దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సట్టి సాయన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ను కలిసి దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. అర్హులైన వారికి పింఛన్లు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమాల సత్యనారాయణ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు