28-11-2025 06:59:50 PM
నిర్మల్ రూరల్: నిర్మల్ పట్టణంలోని లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ఉచితంగా రక్తాన్ని అందించేందుకు శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. లైన్స్ క్లబ్ అధ్యక్షులు సుమిత్ జన్మదిన పురస్కరించుకుని ఈ రక్త శిబిరాన్ని ఏర్పాటు చేయగా పలువురు రక్తం దానం చేసినట్టు బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మన్సూర్ లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు