16 March, 2026 | 8:27 PM

తెలంగాణ సీఎంకి పీఎం బర్త్ డే విషెస్

08-11-2024 10:23 AM

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డికి శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. డిసెంబర్ 7, 2023 నుండి తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రెడ్డి శుక్రవారంతో 55వ ఏట అడుగుపెట్టారు. “తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సుదీర్ఘమైన, ఆరోగ్యవంతమైన జీవితం కోసం నేను ప్రార్థిస్తున్నాను” అంటూ ప్రధాని మోదీ ఎక్స్ లో పేర్కొన్నారు.