calender_icon.png 6 November, 2025 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారం ధరలు పెరిగాయి.. భద్రత కూడా పెంచాలి.!

06-11-2025 01:31:12 PM

డిఎస్పీ బుర్రి శ్రీనివాసులు. 

బిజినపల్లి మండలం వెలుగొండలో కార్డెన్ సర్చ్. 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ప్రస్తుతం బంగారు ధరలకు రెక్కలోచ్చాయి. దొంగతనాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉన్నాయ్ కాబట్టి బంగారు అభరాణాలపై భద్రత కూడా పెంచుకోవాల్సిన భాద్యత అందరిపై ఉందని డీఎస్పీ బుర్రీ శ్రీనివాసులు(DSP Burri Srinivasulu) అన్నారు. గురువారం బిజినేపల్లి మండలంలోని వెలుగొండ గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు సమాచారం ఇవ్వాలన్నారు. దొంగతనాలను నిరోదించడం కోసం ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మొత్తం 46 బైకులు, 3 ఆటోలు, ఒక టాటా ఏసీ, 2 బొలెరోలు, కారు తనిఖీ చేసి, పత్రాలు సరిగా లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. వారితో పాటు సీఐ అశోక్ రెడ్డి, ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు.