10-09-2025 08:43:08 AM
ట్రంప్ తో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా: మోదీ
భవిష్యత్తు, భద్రత కోసం కలిసి పనిచేస్తాం..
ట్రంప్ పోస్టుకుస్పందించిన ప్రధాని మోదీ..
న్యూఢిల్లీ: భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) స్పందించారు. వాణిజ్య చర్చలు విజయవంతంగా జరుగుతాయని ఆశిస్తున్నామని ట్రంప్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో(Prime Minister Narendra Modi) మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్ లో ట్రంప్ పోస్ట్ చేశాడు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోస్టుకు ప్రధాని మోదీ స్పందిస్తూ.. భారత్- అమెరికా(India- America) సన్నిహిత మిత్ర దేశాలు.. సహజ భాగస్వాములని తెలిపారు. వాణిజ్య చర్చలు(US-India trade talks) ఇరుదేశాల భాగస్వామ్యం విస్తృతం చేసేందుకు దోహదం చేస్తాయని వెల్లడించారు. ఇరు దేశాల అపరిమిత సామర్థ్యం విస్తృతానికి మార్గం సుగమం చేస్తాయని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా చర్చలు ముగించడానికి మా బృందాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ట్రంప్(Trump)తో మాట్లాడేందుకు నేను కూడా ఎదురుచూస్తున్నానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇరు దేశాల ప్రజల భవిష్యత్తు, భద్రత కోసం కలిసి పనిచేస్తామని సూచించారు.