calender_icon.png 10 September, 2025 | 12:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లకల్లోలమైన నేపాల్.. సైన్యం ఆధీనంలో ఖాట్మండు

10-09-2025 09:10:48 AM

ఖాట్మండు: ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో నేపాల్(Nepal Violence) అల్లకల్లోలమైంది. నేపాల్ రాజధాని ఖాట్మండును నేపాల్ సైన్యం((Nepal Army)) ఆధీనంలోకి తీసుకుంది. ఖాట్మండులో(Kathmandu) నిరవధిక కర్ఫ్యూ విధించారు. దీంతో భారత్ సరిహద్దులను అప్రమత్తం చేసింది. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం పాక్షికంగా మూసివేశారు. ఖాట్మండులో సెక్రటేరియట్ భవనాన్ని సైన్యం ఆధీనంలోకి తీసుకుంది. సామాజిక మాధ్యమాలపై వ్యతిరేకంగా జెన్-జెడ్ ఉద్యమం ప్రారంభమైంది. కేపీ శర్మ ఓలి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందంటూ జనరేషన్-జెడ్ ప్రచారం చేసింది. మంత్రుల పిల్లలు, విలాస జీవితాలపై వీడియోలను జెన్-జడ్ సోషల్ మీడియాలో వైరల్ చేసింది.

జెన్-జడ్(Gen Z protest) ను అడ్డుకునేందుకు సామాజిక మాధ్యమాలపై నేపాల్ ప్రభుత్వం(Government of Nepal) నిషేధం విధించింది. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధింపుతో యువత భగ్గుమంది. దీంతో నేపాల్ లో కల్లోలం చేలరేగింది. నేతల అవినీతిపై యువతరం కదం తొక్కింది. పార్లమెంట్, సుప్రీంకోర్టు సహా నేతల ఇళ్లకు నిప్పు పెట్టారు. మాజీ ప్రధాని, ఆందోళన కారులు దాడి చేశారు. ఈ దాడుల్లో మరో మాజీ ప్రధాని భార్య మరణించింది. మాజీ ప్రధాని ఝాలానాథ్ ఖనాల్(Former Prime Minister Jhalanath Khanal) ఇంటికి నిప్పు పెట్టడంతో ఆయన భార్యకు గాయలయ్యాయి. 2011 ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు ఝాలానాథ్ ఖనాల్ నేపాల్ ప్రధానిగా ఉన్నారు. ప్రభుత్వ భవనాలు, పార్టీల కార్యాలయాలను ఆందోళన కారులు తగులబెట్టారు. అధ్యక్ష భవనం, పార్లమెంట్, ప్రధాని నివాసానికి నిరసన కారులు నిప్పు పెట్టారు. ఇప్పటికే నేపాల్ ప్రధాని పదవికి కె.పి శర్మ ఓలి,మంత్రులు రాజీనామా చేశారు.