10-09-2025 11:02:43 AM
ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి
వనపర్తి టౌన్ : భూమికోసం,భుక్తికోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి. ఐలమ్మ (Chakali Ailamma) చేసిన పోరాటం ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్బంగా జిల్లా కేంద్రం లోని బస్టాండ్ ఆవరణలో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూల మాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. నివాళులు అర్పించిన వారిలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస.రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్, నాయకులు,ఆటో యూనియన్ నాయకులు తదితరులు ఉన్నారు.