calender_icon.png 10 September, 2025 | 1:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ ఇసుక తరలిస్తున్న లారీ పట్టివేత

10-09-2025 11:00:54 AM

బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని కిన్నెరసాని పరివాహక ప్రాంతమైన బుడ్డగూడెం గ్రామం నుంచి బుధవారం ఉదయం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఓ లారీని బూర్గంపాడు అదనపు ఎస్ఐ నాగబిక్షం పట్టుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు అడ్డుకున్నారు.లారీ డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకోగా, లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.