21-07-2025 11:24:56 AM
మేడిన్ ఇండియా గొప్పతనం ఏంటో ప్రపంచం చూసింది
న్యూఢిల్లీ: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆగస్టు 21 వరకు వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. ఆగస్టు 12 నుంచి 17 వరకు సమావేశాలకు స్వాతంత్ర్య దినోత్సవ సెలవులు ఉన్నాయి. పార్లమెంట్ ఏడు పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలపనుంది. కేంద్రం మరో ఎనిమిది కొత్త బిల్లులకు కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ(PM Narendra Modi) మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బాగా వర్షాలు పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వర్షాల వల్ల రైతులకు ఎంతో లాభదాయకం అన్నారు. రైతుల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ వర్షాలపై ఆధార పడ్డాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ వర్షాకాల సమావేశాలు ఫలప్రదంగా జరగాలని కోరుతున్నానని ప్రధాని తెలిపారు.
ఐఎస్ఎస్ లో మువ్వన్నెల జెండా ఎగరడం దేశ ప్రజలకు గర్వకారణం అన్నారు. అంతరిక్ష యాత్రలో ఇదో ప్రేరణ, స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. ఆపరేషన్ సింధూర్ తో మన దేశ సైనికుల సత్తా చూశాం.. ఆపరేషన్ సింధూర్(Operation Sindoor)తో వందశాతం లక్ష్యాలు సాధించామని వెల్లడించారు. కచ్చితమైన లక్ష్యంతో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేశామని తెలిపారు. మేడిన్ ఇండియా గొప్పతనం ఏంటో ప్రపంచం చూసిందని పేర్కొన్నారు. మన సైనికుల ధైర్య(Indian soldiers) సాహసాలను కొనియాడుతున్నామని చెప్పారు. దేశ ప్రగతి కోసం అందరూ కలిసి నడవాల్సిన సమయమిదని ప్రధాని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, నక్సలిజాన్ని తుదముట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మావోయిస్టు(Maoist) ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సూచించారు. డిజిటల్ ఇండియా యూపీఐ.. దేశ రూపురేఖలు మార్చాయని వెల్లడించారు. ఈ దాశాబ్దంలో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయన్నారు. 90 కోట్లకు పైగా ప్రజలు సామాజిక భద్రత కిందకు వచ్చారని తెలిపారు. ఆరోగ్యం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు.22 నిమిషాల్లోనే పాకిస్థాన్లో ఉగ్రస్థావరాలను మట్టుబెట్టామన్న ప్రధాని మోదీ పాకిస్థాన్ ఉగ్రస్థావరాలను మన ఆర్మీ భూ స్థాపితం చేసిందన్నారు. మావోయిస్టు ముక్త్ భారత్లో ముందడుగు వేశామన్నారు. వందలాది జిల్లాలు నక్సల్ ఫ్రీ జోన్లుగా మారిపోయాయని, రెడ్ కారిడార్లు గ్రీన్ జోన్లుగా మారుతున్నాయని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.