21-07-2025 04:32:56 PM
రిజర్వేషన్ల కోసం ఆశావాహులు ఎదురుచూపులు..
రిజర్వేషన్లు పాతవా? కొత్తవా? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ..
వలిగొండ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలు(Local Body Elections) నిర్వహించేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతుండగా పంచాయతీరాజ్ శాఖ నుండి జిల్లా పంచాయతీ అధికారులకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని సిద్ధంగా చూసుకోవాలని ఆదేశాలు కూడా రావడంతో మరో ఐదు రోజులలోపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అటు అధికారులు ఇటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల కోసం ఆశావాహులు ఎన్నో నెలలుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను పాత రిజర్వేషన్లతో నిర్వహిస్తుందా లేదా కొత్త రిజర్వేషన్లతో నిర్వహిస్తుందా అనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి ఎన్నికల నిర్వహణ ముందు నోటిఫికేషన్ కు, రిజర్వేషన్లకు నరాలు తెగేంత ఉత్కంఠ కొనసాగుతుండగా ఎన్నికలలో పోటీ చేసే వారికి మరింత టెన్షన్ ఉంటుందని ఆశావాహులు తెలియజేస్తున్నారు.