calender_icon.png 21 July, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూరారం ఉమామహేశ్వర ఆలయంలో కావడి యాత్ర భక్తులు

21-07-2025 04:36:48 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): బోనాల పండుగ సందర్భంగా సూరారం ఉమామహేశ్వర ఆలయం(Umamaheshwara Temple)లో నిర్వహించిన కావడి యాత్ర భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగింది. జగద్గిరిగుట్ట, రామారం కాలనీ, సూరారం కాలనీల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కావడులు మోస్తూ అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఈ యాత్రలో పురుషులు, మహిళలు, చిన్నారులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యక్రమ సమన్వయకర్త సంగీత పత్ర, సరోజినీదేవి, ఇతర మహిళా నాయకులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఇన్‌చార్జ్ ముద్దపురం మధన్ గౌడ్ భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించారు.

తాగునీరు, భక్తులకు అందుబాటులో ఉంచారు. ఒడిశా సంప్రదాయంతో ప్రత్యేకత సంతరించుకున్న యాత్ర, ఈ నెల ఒడిశాలో శ్రావణ మాసం సందర్భంగా కావడి యాత్రకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి శ్రావణ మాసం రెండో సోమవారం నాడు ఒడిశా ప్రజలు ఏకతాటిపైకి వచ్చి భక్తితో శివునికి సమర్పణ చేస్తారు. ఈ సందర్భంగా వారు కొబ్బరి కాయలు మోస్తూ శివాలయాలను దర్శించుకుంటారు. శివుడికి కొబ్బరి నీళ్లు సమర్పించిన తర్వాతే వారు భోజనం చేస్తారు. అంతవరకు నీటికూడా తాగరు. ఈ సంప్రదాయం ఒడిశా కమ్యూనిటీ ప్రజలు హైదరాబాద్‌లో కూడా పాటించడం విశేషం. ఈ సంవత్సరం కూడా సురారంలో జరిగిన యాత్రలో ఒడిశా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనడం కనువిందుగా నిలిచింది.