21-07-2025 04:33:23 PM
మాంచెస్టర్: గత ఏడాది ఐపీఎల్ తో వెలుగులోకి వచ్చిన తెలుగు క్రికెటర్ నితీష్ కుమర్ రెడ్డి కొన్ని నెలలకే భారత్ జట్టులో చోటు దాకించుకున్నారు. తాజాగా ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కూ ఎంపికై రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్న ఈ ఆల్‌రౌండర్.. అర్ధంతరంగా ఇంటిముఖం పడుతున్నాడు. ఆదివారం జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా ఎడమ మోకాలికి గాయమైంది. దీంతో భారత ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
గాయపడిన పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నాల్గవ టెస్ట్‌కు ఎంపికకు అందుబాటులో లేడని బీసీసీఐ సోమవారం తెలిపింది. రెండు, మూడవ టెస్టుల్లో పాల్గొన్న నితీష్ ఆదివారం జిమ్‌లో వర్కౌట్ లో చేస్తున్నప్పుడు స్కాన్‌లలో లిగమెంట్ దెబ్బతిన్నట్లు తేలింది. ఈ కారణంతోనే మిగిలిన రెండు టెస్టు ఆడకుండా నితీష్ స్వదేశానికి తిరిగి వస్తున్నాడు. జట్టు అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటుందని బీసీసీఐ (BCCI) ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉండగా, ఈ సిరీస్‌లో ఇంకా ఆడని అర్ష్‌దీప్, గతవారం బెకెన్‌హామ్‌లో జరిగిన శిక్షణా సెషన్‌లో నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎడమ బొటనవేలికి గాయమైంది. హర్యానా సీమర్ అన్షుల్ కాంబోజ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అతను ఇప్పటికే మాంచెస్టర్‌లోని జట్టుతో జతకట్టాడని, నాల్గవ టెస్ట్ బుధవారం ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో ఆతిథ్య ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది.
నాల్గవ టెస్టు కోసం భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (సి), రిషబ్ పంత్ (విసి & డబ్ల్యుకె), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (డబ్ల్యుకె), వాషింగ్టన్ సుందర్, జస్ప్రిత్ థాకుర్రా, జస్ప్రిత్ థాకుర్రా సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్.