calender_icon.png 21 July, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో 49 రద్దు చేయాలని కాసిపేటలో ఆదివాసీల ధర్నా

21-07-2025 04:29:21 PM

ప్రశాంతంగా బంద్..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) కాసిపేటలో జీవో నెంబర్ 49 ని వెంటనే రద్దు చేయాలనీ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. సోమవారం 49 జీవోను రద్దు చేయాలని తలపెట్టిన బంద్ ను పురస్కరించుకొని కాసిపేట యాప ప్రధాన రహదారిపై ఆదివాసీలు బైఠాయించారు. అటవీ ఖనిజ సంపదను దోచుకోవాలనే ఉదేశ్యంతో టైగర్ రిజర్వ్ పేరుతో ఆదివాసుల హక్కులను హరించేందుకు 49 జీవం తెచ్చారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన 49 జీవో మాకొద్దని ఆదివాసీలు గర్జించారు. ఇప్పటికైనా జీవో 49ను రద్దు చేయాలనీ ఆదివాసీలు డిమాండ్ చేశారు. 49 జీవో రద్దు కోసం  ప్రజా ఉద్యమాన్ని హెచ్చరించారు. అందుకోసం పాలకుల ఇళ్ళు, ప్రభుత్వ ,కార్యాలయాలను ముట్టడిస్తామని  హెచ్చరించారు.

బంద్ సంపూర్ణం...

జీవో49 కు వ్యతిరేకంగా తలపెట్టిన బంద్ సంపూర్ణంగా జరిగింది. రాష్ట్రవ్యాప్త బందు పిలుపు పిలుపులో భాగంగా దేవపూర్లో షాపులు బందు చేసి యజమానులు సంఘీభావం తెలిపారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ప్రశాంతంగా బంద్ ముగిసింది.