calender_icon.png 21 July, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రష్యాలో భూకంపం..

21-07-2025 02:09:57 AM

  1. రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదైన తీవ్రత
  2. సునామీ హెచ్చరికలు జారీ

మాస్కో, జూలై 20: రష్యా తీరంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.4గా నమోదైంది. ఈ భూకంప ప్రభావంతో రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పానికి, హవాయిలోని కొన్ని ప్రాంతా లకు పసిఫిక్ సునామీ హెచ్చరికల కేం ద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ముందు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అ ధికారులు సూచనలు జారీ చేశారు.

భూకంప కేంద్ర పెట్రోపావ్లోప్స్ నగరానికి తూర్పున 144 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. కమ్చట్కా ద్వీపకల్పంలో గంట సమయంలోనే ఐదు భూకంపాలు నమోదై నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) పేర్కొంది. ఈ భూకం పం వల్ల ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు.