5 August, 2026 | 2:28 AM

దేవరకద్రలో ఘనంగా పోచమ్మ బోనాలు

05-08-2026 01:36 AM

దేవరకద్ర ఆగస్టు 4 (విజయక్రాంతి): దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో బోనాల పండుగ మహోత్సవం సంబురంగా జరిగాయి. ఈ సందర్బంగా మంగళవారం అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలలో పాల్గొని, దేవరకద్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ దమయంతి, మండల పార్టీ అధ్యక్షులు అంజలి రెడ్డి పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.