5 August, 2026 | 2:45 AM

విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన పశువులకు పరిహారం చెల్లింపు

05-08-2026 01:36 AM

మంత్రి సీతక్క చేతుల మీదుగా పంపిణీ 

ములుగు, ఆగస్టు 4 (విజయ క్రాంతి) : విద్యుత్ ప్రమాదంలో పశువులు మృతి చెందిన బాధిత రైతులకు టీజీ ఎంపీడీసీఎల్ తరఫున మంజూరైన నష్టపరిహార చెక్కులను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి సీతక్క చేతుల మీదుగా మంగళవారం ములుగులో అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా జగ్గన్నపేట గ్రామానికి చెందిన అజ్మీరా అనిల్ కుమార్, గండ్రకోట అశోక్, పతిపల్లి గ్రామానికి చెందిన సముద్రాల బక్కయ్యలకు విద్యుత్ ప్రమాదంలో పశువులు మృతి చెందినందుకు ఒక్కొక్కరికి నలభై వేల రూపాయలు చొప్పున నష్టపరిహార చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ ఆపరేషన్, టెక్నికల్ డివిజనల్ ఇంజనీర్ ములుగు కన్నా రాజు, ఎన్ వేణుగోపాల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ములుగు, బి. రవి అసిస్టెంట్ ఇంజనీర్ ములుగు, తదితరులు పాల్గొన్నారు.