5 August, 2026 | 7:08 PM

కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి

21-06-2024 12:19 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ స్పీకర్, బీఆర్ఎస్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం పోచారం నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ సమక్షంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం పోచారం ఎంతో కృషి చేశారని రేవంత్ కోనియాడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచనలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.