5 August, 2026 | 8:10 PM

పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్తత

21-06-2024 12:04 PM

హైదరాబాద్: బంజారాహిల్స్ లోని  బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం వెళ్లారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి సీఎం ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి వెంట పోచారం ఇంటికి మంత్రి పొంగులేటి, ఎంపీ బలరాం నాయక్, కాంగ్రెస్ నేతలు వెళ్లారు. ఈ నేపథ్యంలో బాల్క సుమన్, బీఆర్ఎస్ నేతలు పోచారం నివాసానికి వెళ్లారు. పోచారం నివాసం వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.